అమరావతి : ఏపీ(AP)లో ఉల్లి రైతులు(Onion Farmers)మద్ధతు ధర(Support Price) లభించక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు ఉల్లి రైతులు ఉల్లి సాగులో మద్దతు ధర లభించక నష్టాలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం(Suicide Attempt) చేస్తున్నారు. కర్నూలు జిల్లా(Kurnool District) పోలకల్(Polakal Village) గ్రామంలో ఉల్లి రైతులు వెంకటేష్, నాయుడులు ఇద్దరు ఉల్లి పంటకు మద్దతు ధర రావడం లేదని..సీఎం చంద్రబాబు( Chandrababu Naidu)ఉల్లి రైతుల నష్టాలను తీర్చలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వారిని కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని..ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.