విధాత:
2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన కమిటీ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండ రామ్, శ్రీపాల్ రెడ్డిలను కలసి వినతిపత్రం సమర్పించారు. సంవత్సరం న్నర కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప రావలసిన జీపీఎఫ్, జీఎల్ఐఎస్సీ, జీఐఎస్, లీవ్ ఇన్ క్యాస్మెంట్ మ్యుటేసన్, గ్రాట్యుటీ ప్రయోజనాలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నామని అన్నారు. కొంతమంది మనోవేదనతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.మనో వేదన అర్థం చేసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి బకాయిలు ఇప్పించాలని కోరారు. ఆత్మ గౌరవంతో జీవించేలా సహకరించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్ర, మహబూబ్ అలీ తదితరులు ఉన్నారు.
retired employees | రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించండి..కోదండరామ్, నరేందర్ రెడ్డిలకు వినతి
2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన కమిటీ పేర్కొంది.

Latest News
మహిళా పైలట్ గురించి అజిత్ పవార్ ట్వీట్ వైరల్.. అందులో ఏముందంటే..?
కొంచెం నాటీ కొంచెం స్వీట్.. పట్టు పరికిణిలో మీనాక్షి క్యూట్ పోజులు
కొలువుదీరిన కన్నెపల్లి తల్లి.. జనారణ్యమైన మేడారం
బాల్కనీలో బిగ్ బాస్ బ్యూటీ హాట్ పోజులు.. అందాలతో గత్తర లేపిన దివి
తెలంగాణ ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ల బకాయిలు 11,500 కోట్లు.. శాపంగా మారిన ఐఎఫ్ఎంఐఎస్
బ్లూ డ్రెస్ లో మృణాల్ ఫోటో షూట్.. క్యూట్ అంతే
విమాన ప్రమాదం తర్వాత అజిత్ పవార్‌ను ఎలా గుర్తు పట్టారంటే..?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గ్లామర్‌కు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏంటి?
సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన నేతలు వీళ్లే..
దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు !