Site icon vidhaatha

Prabhas|ఓల్డ్ లుక్‌లోకి వ‌చ్చేసిన ప్రభాస్.. డార్లింగ్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

Prabhas| యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాడు. ఆయ‌న బాహుబ‌లి సినిమా త‌ర్వాత చేసిన సాహో,రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు ఫ్లాప్ అయిన ఇటీవ‌ల విడుద‌లైన స‌లార్ చిత్రం మాత్రం పెద్ద హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కల్కి మూవీతో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌భాస్ ఈ మ‌ధ్య చాలా లావుగా, కొంచెం ఎక్కువ వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తిగా క‌నిపించాడు. అది చూసిన ఫ్యాన్స్ చాలా నిరాశ‌కి గుర‌య్యారు.

మ‌రోవైపు ప్ర‌భాస్ మోకాలికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. దాంతో ఆయ‌న ఆరోగ్యంపై ఆందోళ‌న చెందారు. అయితే ఇటీవ‌ల ప్ర‌భాస్ బాడీ ఫిట్‌నెస్‌పై పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌ని అర్ధ‌మ‌వుతుంది. అందుకే ఆయ‌న లుక్స్‌లో తేడాలు క‌నిపించాయి. కాని ఇప్పుడు మాత్రం ప్ర‌భాస్ ఓల్డ్ లుక్‌లోకి వ‌చ్చాడు. ఆయన న్యూ లుక్ చూసి ప్ర‌భాస్ అభిమానులు తెగ ఫిదా అయిపోతున్నారు. ప్ర‌భాస్ ట్రాన్స‌ఫ‌ర్‌మేష‌న్ అదిరింద‌ని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ న్యూలుక్‌ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వీడియోలో ప్రభాస్ బరువు తగ్గి, మిర్చి సమయంలోని లుక్స్ తో చాలా క్యూట్‌గా క‌నిపిస్తున్నారు.

వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్స్.. ప్ర‌భాస్ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఏ మూవీ కోసం ప్ర‌భాస్ ఇలా మారాడ‌ని ఆలోచ‌న‌లు కూడా చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ క‌ల్కి మూవీ షూటింగ్ ఇటీవ‌ల పూర్తి చేశాడు. ఈ చిత్రంకి సంబంధించి కొన్ని ప్యాచ్ వర్క్స్ మిగిలి ఉండ‌గా, త్వ‌ర‌లోనే అది కూడా పూర్తి కానుంద‌ని అంటున్నారు. మే9న మూవీని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని అదే స‌మ‌యానికి ఎల‌క్షన్స్ ఉండ‌డంతో మ‌ళ్లీ వాయిదా వేసిన‌ట్టుగా తెలుస్తుంది. జులైలో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్స్‌, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి, కమల్ హాసన్ వంటి వారు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో సి అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version