Site icon vidhaatha

Pulivendula ZPTC Bypoll| వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు..ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

అమరావతి : పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta)  జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల(ZPTC Bypoll) పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. 11గంటలకల్లా 38.64శాతం పోలింగ్ జరిగింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు..అరెస్టుల పర్వం(YSRCP vs TDP Clashes)కొనసాగుతుంది. కనంపల్లె, నడింపల్లిలో ఘర్షణలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(Avinash Reddy Arrest)ని పోలీసులు అరెస్టు చేసి ఎర్రగుంట్ల పీఎస్ కు తరలించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో అధికార టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని..పోలీసులను అడ్డుపెట్టుకుని ఓటర్లు స్వేచ్చగా ఓటు వేయకుండా రిగ్గింగ్ చేస్తున్నారంటూ వైసీపీ ఎన్నికల సంఘాని(EC Complaint)కి ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ కార్యాలయం ముందు  ధర్నా(Dharna)నిర్వహించారు.

వైసీపీ కార్యకర్తలను, ఓటర్లను పోలీసులతో అడ్డుకుని బెదిరించి వారి పేర్లతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఓట్లు వేయిస్తున్నారని అంబటి ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఓటర్లను మాత్రమే ఓటింగ్ కు అనుమతిస్తూ..వైసీపీ ఓటర్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్నికల కమిషనర్ నీలం సాహ్నికి వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు , వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , మొండితోక అరుణ్ కుమార్ , విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డిలు ఉన్నారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పలువురు నేతలను హౌస్ అరెస్టు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
పులివెందులలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version