విధాత, హైదరాబాద్ : ఒకవైపు డ్రగ్స్ రహిత వేడుకలు జరగాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెబుతోంటే.. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సమయం పెంచడం ఏంటని బీజేపీ బహిష్కృత గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ చేస్తున్న డ్రామా అని, కమిషనర్ డ్రగ్స్ నియంత్రణ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని ఆయన (drugs allegations)విమర్శించారు. యువతను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
డ్రగ్స్ వినియోగించే వారు తెలంగాణలో 29లక్షల మంది ఉన్నారని..ఇది దేశంలో అగ్రస్థానం ఉందని రాజాసింగ్ గుర్తు చేశారు. ఇది తెలంగాణకు అవమానకరం అన్నారు. తెలంగాణ యువత సర్వనాశనానికి సంకేతమన్నారు. ఇంత మందికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయన్నదానిపై సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీలు చెప్పాలన్నారు. డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, యాక్టర్లు, విద్యావేత్తలే అధికంగా డ్రగ్స్ వాడుతుండటం శోచనీయమన్నారు. యువత చైతన్యవంతంగానే ఉంటానే..రాష్ట్రం, దేశం పురోగమిస్తుందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో రెండోసారి పట్టుబడిన తీరు చూస్తుంటే సమస్య తీవ్రతను వెల్లడిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ దందాలు పెరిగిపోయాయన్నారు. న్యూ ఇయర్ వేడుకల తర్వాత డ్రగ్స్ నియంత్రణ చర్యలు ఉండవన్నట్లుగా పోలీస్ శాఖ హడావుడి కనిపిస్తుందన్నారు. పోలీసు అధికారులకు అనేక మందికి డ్రగ్స్ దందా చేసేవారితో సంబంధాలు ఉన్నాయని దానిపై కమిషనర్ దృష్టి పెట్టాలన్నారు. రౌడీషీటర్లు సోషల్ మీడియాలో స్టేట్మెంట్లు ఇస్తున్నారని, పోలీసులు సైతం రాజకీయాలు చేస్తున్నారని ఇది చాల దురదృష్టకరం అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
