విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ కొండాపూర్(Kondapur) ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ(Rave Party)పై పోలీసులు దాడి(Police Raided)చేసి భగ్నం చేశారు. రేవ్ పార్టీకి సంబంధించి 11మందిపై కేసు నమోదు(Case Registered)చేసి…9మందిని అరెస్టు చేశారు. ఆరు కార్లు, 11సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్‌డ్రగ్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రుమ్, 1.91 గ్రాముల చెరాస్ డగ్స్ లభ్యమయ్యాయి. నిందితులను శేరిలింగపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లుగా ఎస్టీఎఫ్ సీఐ సంధ్య తెలిపారు. దాడుల్లో డ్రగ్స్ సరఫరాదారు రాహుల్, ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే (ఆర్గనైజర్), అశోక్ కుమార్, సమ్మెల సాయి కృష్ణ (ఆర్గనైజర్), హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్ శ్రీ దత్, సమత, తేజ అనే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయగా..వారు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
విజయవాడకు చెందిన వాసు, శివంరాయుడు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వారు మారు పేర్లతో బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డులను వాడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. డబ్బున్న వ్యక్తులను అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తూ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.