Site icon vidhaatha

New Delhi | 26 విపక్షాలపై ఢిల్లీలో కేసు నమోదు

New Delhi

న్యూఢిల్లీ: తమ కూటమికి ఐఎన్‌డీఐఏ అని పేరు పెట్టుకోవడం ద్వారా ఆ పదాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై ఢిల్లీలోని బరఖంబ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్షాలు ఇండియా పేరు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డాక్టర్‌ అవినాశ్‌ గుప్తా అనే వ్యక్తి ఈ కేసు నమోదు చేశారు.

దీనిని ఎన్నికల్లో వాడటం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. భారతదేశం పేరును 26 పార్టీలు దుర్వినియోగం చేశాయని ఆయన ఆరోపింపించారు.

Exit mobile version