CM Revanth Reddy: తెలంగాణ(Telangana) ప్రజలకు ఆదర్శంగా నిలిచిన(Telangana leaders honored)వారిని మా ప్రభుత్వం గుర్తిస్తుందని..కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు హర్టికల్చర్ యూనివర్సిటీకి, జైపాల్ రెడ్డి పేరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టాం..సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy )పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోయేలా మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. మగ్దూం భవన్ లో సీపీఐ(CPI) జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్ధివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు(tribute). ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి మరణం తెలంగాణకు తీరని లోటు అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్గాలని కోరుకుంటున్నానని తెలిపారు.
రాజీపడని నిరాడంభర జీవితాన్ని సురవరం గడిపారని..రాజీ లేని సిద్ధాంత పరమైన పోరాటం చేశారన్నారు. విద్యార్థి దశ నుంచి పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగటం గర్వకారణం మని.. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన గొప్పనేతల్లో ఆయన ఒకరని కొనియాడారు. కింద స్థాయి కార్యకర్త నుంచి ఎంపీగా వివిధ హోదాల్లో పనిచేసినా ఏనాడు అహంకారం దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదన్నారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నాకు వారు లేఖ రాశారని గుర్తు చేసుకున్నారు. వెంటనే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సురవరం సేవలకు గుర్తుగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మా పీఏసీ సమావేశం లో కూడా సురవరం సేవలను స్మరించుకున్నామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సురవరంకు సంతాపం తెలిపారని వెల్లడించారు.