Sammakka Sarakka Jatara digital hundi| వన దేవతలు సమ్మక్క, సారక్కలకు డిజిటల్ హుండీ

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారక్క జాతరలో అమ్మవార్లకు హుండీ విరాళాలను ఆన్ లైన్ ద్వారా అందించేందుకు అధికారులు డిజిటల్ హుండీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

విధాత: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని(Medaram temple) వనదేవతలు సమ్మక్క, సారక్క జాతరలో(Sammakka Sarakka Jatara) అమ్మవార్లకు హుండీ విరాళాల(devotees donation)ను ఆన్ లైన్ ద్వారా(online donation) అందించేందుకు అధికారులు డిజిటల్ హుండీ(Canara Bank digital hundi launch) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దర్శనం తర్వాత కానుకలు వేసేందుకు నగదు నోట్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఈ సమస్యపై తాడ్వాయి కెనరా బ్యాంకు యంత్రాంగంతో చర్చించారు. మేడారం ప్రాంగణంలో క్యూఆర్ (QR)కోడ్ స్కానర్లను ఏర్పాటు చేయించారు.

వీటిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ఆవిష్కరించారు.

కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న సమ్మక్క, సారాలమ్మ మేడారం జాతర తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు వన దేవతల దర్శనానికి తరలివస్తుంటారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు, కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించడం.. అనంతరం వనదేవతల గద్దెల వద్దకు చేరుకుని తల్లులకు ప్రీతికరమైన ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పిస్తుంటారు. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజును దర్శించుకుని… గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించి తల్లుల దీవెనలు పొందుతుంటారు. ఈ సందర్భంగా నగదుతో మొక్కులు చెల్లించుకునేందుకు ఇబ్బందులు లేకుండా కొత్తగా అధికారులు డిజిటల్ హుండీ అందుబాటులోకి తేవడం పట్ల భక్తుల నుంచి హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.