Sayaji shinde| ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన షియాజీ షిండే.. ఏం జ‌రిగిందంటూ టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

  • Publish Date - April 12, 2024 / 05:27 PM IST

Sayaji shinde| షియాజీ షిండే.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. డిఫ‌రెంట్ వాయిస్‌తో పాటు త‌న‌దైన న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నాడు. ఠాగూర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌రైన షియాజీ షిండే ఆ తరువాత ‘వీడే’ ‘గుడుంబా శంకర్’ ‘అతడు’ ‘సూపర్’ వంటి చిత్రాలతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. దేవదాసు'(2006) ‘పోకిరి’ వంటి చిత్రాలు అత‌నికి మంచి స్టార్‌డం తెచ్చిపెట్టాయి. మ‌రాఠి న‌టుడు అయిన తెలుగులో మాత్రం మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు. మరాఠి, తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళం,గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించి అల‌రించాడు. అయితే షియాజి షిండే న‌టుడు కాక ముందు వాచ్‌మెన్‌గా ప‌ని చేశాడు.

దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించిన షియాజీ షిండే గత కొంతకాలంగా తెలుగు సిని పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. అయితే ఆయ‌న గురువారం అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుప‌త్రిలో చేర్చ‌డంతో ఆయ‌న‌కి ఏమైందా అనే టెన్ష‌న్‌లో అభిమానులు ఉన్నారు. అయితే అత‌నికి సీజీ టెస్ట్ చేయగా.. ఆయనకు 2D ఎకోకార్డియోగ్రఫీని పూర్తి చేసినప్పుడు, గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించమని వైద్యులు తెలియ‌జేశారు. ఛాతిలో నొప్పి రావ‌డంతో కొన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇక షియాజీ షిండేకి వెంట‌నే యాంజియోప్లాస్టీ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం షియాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్వరలోనే అత‌నిని డిశ్చార్జ్ చేయ‌నున్న‌ట్టు వైద్యులు తెలియ‌జేశారు. ఇక షియాజి షిండే ఆరోగ్యం బాగుంద‌ని తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు కూడా షియాజీ షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. కాగా, ఈయ‌న మొదట 2001లో వచ్చిన ‘సూరి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమ్యారు చివరిగా 2023లో వచ్చిన ‘ఏజెంట్ నరసింహ’ సినిమాలో కనిపించారు. ఆ త‌ర్వాత ఏ సినిమాల్లోనూ ఆయన కనిపించలేదు.

Latest News