Kaleshwaram Commission Report| అసెంబ్లీలో ఉత్తమ్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న బీఆర్ఎస్ సభ్యులు!

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)నిర్మాణంలోని అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission Report)ఇచ్చిన నివేదికను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అసెంబ్లీ(Telangana Assembly)లో ప్రవేశపెట్టి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు(BRS MLAs) పదే పదే అడ్డుతగులుతున్నారు. కమిషన్ నివేదికలోని అంశాలను..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులను..తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు అలైన్మెంట్ మార్పు, కాళేశ్వరం నిర్మాణం..కూలిపోవడం పరిణామాలతో రాష్ట్ర […]

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)నిర్మాణంలోని అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission Report)ఇచ్చిన నివేదికను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అసెంబ్లీ(Telangana Assembly)లో ప్రవేశపెట్టి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు(BRS MLAs) పదే పదే అడ్డుతగులుతున్నారు. కమిషన్ నివేదికలోని అంశాలను..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులను..తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు అలైన్మెంట్ మార్పు, కాళేశ్వరం నిర్మాణం..కూలిపోవడం పరిణామాలతో రాష్ట్ర ఖజానాకు జరిగిన శాశ్వత నష్టాన్ని ఉత్తమ్ ఏకరువు పెడుతూ బీఆర్ఎస్ పై విమర్శలు చేసిన క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తమ్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు నిరూపయోగంగా మారిందని..ఇందుకు బీఆర్ఎస్ పాలకులు కేసీఆర్ పూర్తి బాధ్యులంటూ ఉత్తమ్ నిప్పులు చెరిగారు. డిజైన్లు, నిర్మాణాల్లో ఎక్కడా నిబంధనలు పాటించలేదని..నాణ్యత లేదన్నారు. కాళేశ్వరం కూలిపోయాక కూడా తెలంగాణలో 261లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని గుర్తు చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎక్కడ తమ తప్పులు బయటపడుతాయోనని కోర్టులకు వెళ్లి అసెంబ్లీలో చర్చ జరుగకుండా అడ్డుకునే కుట్రలు చేశారని ఉత్తమ్ మండిపడ్డారు.

ఐదేళ్లలో 125టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోసి..అందులో 35టీఎంసీలను మళ్లీ కిందకు వదిలారని ఆరోపించారు. డీపీఆర్ అప్రూవ్ మెంట్ కాకముందే టెండర్లు పిలిచారని..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా ఇల్లీగల్ అని కమిషన్ తేల్చిందని ఉత్తమ్ వివరించారు. కాళేశ్వరం స్వతంత్ర భారత దేశంలో అతిపెద్ద మానవ తప్పిదమని ఉత్తమ్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు.  ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గుది బండ అని..ప్రాణహిత చేవేళ్లకు 34వేల కోట్లు ఖర్చుతో నిర్మించడం మానేసి..కాళేశ్వరం ప్రాజెక్టుతో 1లక్ష 40వేల కోట్లకు వ్యయం పెంచారని ఉత్తమ్ తప్పుబట్టారు. ప్రాజెక్టు పనిచేయకపోయినా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ విద్యుత్తు శాఖకు రూ. 9,730కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఉందని..ఇక నడిపిస్తే ఎంత భారం భరించాలో అర్ధం చేసుకోవాలన్నారు.