విధాత : అపర కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk), టెస్లా కార్ల(Tesla Car) సంస్థ ఇటీవలే భారత్ లో అడుగుపెట్టి ఢిల్లీ, ముంబైలలో షో రూమ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో టెస్లా షో రూమ్(Mumbai Showroom) నుంచి మోడల్ వై(Model Y )కార్ల డెలివరీలను ఆ కంపనీ ప్రారంభించింది. తొలి కారును మహారాష్ట్ర రవాణా మంత్రి(Maharashtra Minister) ప్రతాప్ సర్ నాయక్(Pratap Sarnaik) కొనుగోలు చేశారు. టెస్లా సంస్థ ప్రతినిధుల నుంచి తన వైట్ కలర్ వై మోడల్ టెస్లా కారును మంత్రి ప్రతాప్ సర్ నాయక్ అందుకున్న ఫోటోలు సోసల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ మోడల్ కార్లపై అవగాహాన పెంచేందుకే తాను టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) వినియోగాన్ని పెంచేందుకు మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వం అనేక వెసులుబాట్లను ప్రజలకు అందిస్తుందని గుర్తు చేశారు. టెస్లా(Tesla) కార్లకు దేశంలో ఇప్పటికే 600కు పైగా బుకింగ్స్ వచ్చాయని ఈ ఏడాది 350నుంచి 500కార్లను సరఫరా చేస్తామని కంపనీ ప్రతినిధులు వెల్లడించారు.