Vindhya Vishaka| బ‌ట్టలు మార్చుకోవ‌డానికి గ‌దులు ఉండేవి కావు.. అంద‌రి ముందే మార్చుకోవ‌ల్సి వ‌చ్చేది..!

Vindhya Vishaka| ఇటీవ‌ల చాలా మంది భామ‌లు త‌మ‌కు ఎదురైన విచిత్ర అనుభ‌వాల గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు.

  • Publish Date - April 14, 2024 / 10:30 AM IST

Vindhya Vishaka| ఇటీవ‌ల చాలా మంది భామ‌లు త‌మ‌కు ఎదురైన విచిత్ర అనుభ‌వాల గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా ఇండియన్ ప్రిమియర్ లీగ్, ప్రొకబడ్డీ లీగ్‌లతోపాటు పలు క్రికెట్‌ టోర్నమెంట్స్‌కు తెలుగు ప్రెజంటర్‌గా ప‌నిచేసిన వింధ్య విఖాఖ మోడ‌లింగ్ చేసే రోజుల‌లో తాను ప‌డ్డ ఇబ్బందుల గురించి పంచుకుంది. కళాశాలలో చదువుకునే స‌మయంలో న్యూస్ రీడ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత మోడ‌లింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంద‌ట‌. రీసెంట్ గా వింధ్య ఓ ఇంటర్వ్యూలో తన మోడలింగ్ రోజులని గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదువుకునే రోజుల్లో మోడలింగ్ అంటే ఇష్టం చాలా ఇష్టం ఉండేద‌ట‌. అయితే త‌న‌కి దానిపై పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండేది కాద‌ని చెప్పింది.

చ‌దువుని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు అని త‌న త‌ల్లి పెట్టిన కండీష‌న్‌ని పాటిస్తూ మోడ‌లింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంద‌ట వింధ్య. అలానే అందాల పోటీల్లో అవార్డులు గెలుచుకున్నట్లు చెప్పుకొచ్చింది. తొలిసారి హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న వింధ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొంద‌ట‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్యాష‌న్ వీక్ గురించి అంత‌గా అవ‌గాహ‌న లేద‌ట‌. అయితే ఒక‌సారి దాంట్లో పాల్గొన్న త‌ర్వాత మోడ‌లింగ్ జోలికే వెళ్ల‌కూడ‌ద‌ని డిసైడ్ అయింద‌ట‌. అందుకు కార‌ణం అక్కడ అమ్మాయిలు బట్టలు మార్చుకోవడానికి కనీసం గదులు కూడా ఉండేవి కావ‌ట‌. అంతా చూస్తుండగానే స్టేజికి ఒక పక్కన బ‌ట్టలు మార్చుకోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌చ్చేది. అది ఎంత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌ని అని వింధ్య ప్ర‌శ్నించింది.

ఇక ఫ్యాషన్ వీక్ వాతావరణం చూశాక మోడలింగ్ నాకు కరెక్ట్ కాదని బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలియ‌జేసింది. నాకు అదే లాస్ట్ ఫ్యాష‌న్ వీక్ అయింద‌ని పేర్కొంది. అయితే అన్ని చోట్ల అలాంటి పరిస్థితే ఉంటుందని నేను అన‌డం లేదు కాని, నాకు యాంక‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చింది.సినిమా అవ‌కాశాలు త‌లుపుత‌ట్టాయి. గోపాల గోపాల, ముకుంద చిత్రాలకు నన్ను అడిగారు కాని సినీ ఫీల్డ్‌పై అంత ఇంట్రెస్ట్ లేక వెళ్ల‌లేద‌ని పేర్కొంది.

Latest News