Warangal news । నర్సంపేటలో మెడికల్ కాలేజీని ప్రారంభించిన మంత్రులు

వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం ప్రభుత్వ వైద్య శాలను మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

Warangal news ।  నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం ప్రభుత్వ వైద్య శాలను మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కళాశాల ప్రారంభం కొరకు హెలికాప్టర్ లో నర్సంపేట హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖకు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళి నాయక్, కె ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, డిఎంఈ వాణి, డిసిపి రవీందర్, ఆర్డీఓ కృష్ణవేణి, కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.అనంతరం వైద్య కళాశాలను దామోదర రాజ నర్సింహా ప్రారంభించి అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు..

Latest News