World Bank | 50 ఇండియన్ కంపెనీలపై వరల్డ్ బ్యాంక్ నిషేధం

మోసపూరిత, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినందుకు ప్రపంచ బ్యాంక్ నిషేధించిన భారతీయ కంపెనీలు, వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ జాబితాలోకి తాజాగా ట్రాన్స్ ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ చేరింది

మోసపూరిత, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినందుకు ప్రపంచ బ్యాంక్ నిషేధించిన భారతీయ కంపెనీలు, వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ జాబితాలోకి తాజాగా ట్రాన్స్ ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ చేరింది. .ఈ ఏడాది నవంబర్ 4న లంచం తీసుకున్నందుకు ఈ సంస్థపై నిషేధం విధించింది ప్రపంచబ్యాంక్. గుజరాత్ కు చెందిన ట్రాన్స్ ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థను టారిల్ అని కూడా పిలుస్తారు. నైజీరియాలో విద్యుత్ ప్రాజెక్టు అప్ గ్రేడ్ లో 486 మిలియన్ డాలర్ల లంచం తీసుకుంటూ ఈ సంస్థ ప్రపంచబ్యాంకుకు పట్టుబడింది.

ట్రాన్స్ ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్ అనేది స్టాక్ ఎక్చేంజ్ లిస్టెడ్ కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర రూ. 396గా ఉంది. దీనిని జితేంద్ర మమ్ తోరా, కరుణ మమ్ తోరా, సత్యెన్ మమ్ తోరా ప్రమోట్ చేశారు. 1994లో స్థాపింంచిన ఈ కంపెనీకి గతంలో త్రివేణి ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ప్రపంచ బ్యాంక్ అధికారుల నివేదిక ప్రకారంగా వరల్డ్ బ్యాంక్ నిధులు సమకూర్చిన నైజీరియన్ పవర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అప్ గ్రేడ్ పరికరాల సరఫరాలో లంచం తీసుకుంటూ ప్రపంచబ్యాంక్ కు పట్టుబడింది. ఈ కంపెనీ ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టుల చేపట్టకుండా 2029 జూన్ వరకు అంటే నాలుగేళ్లు నిషేధించారు.

మోసపూరిత, అవినీతి ఆరోపణల నేపథ్యంలో భారత్ కు చెందిన 50 కంపెనీలు లేదా వ్యక్తులపై ప్రపంచ బ్యాంక్ నిషేధం విధించింది. ముంబైకి చెందిన కంపెనీ ఐక్యూవీఐఏ కన్సల్టింగ్ అండ్ ఇన్షర్మేషన్ సర్వీసెస్ ఇండియాపై కూడా మోసపూరిత ఆరోపణలు రావడంతో నిషేధం విధించారు. 2024లో భారత్ కు చెందిన ఐదు కంపెనీలు, ఒక వ్యక్తిపై అంతర్జాతీయ ప్రాజెక్టుల నిర్వహణ విషయమై ప్రపంచ బ్యాంక్ నిషేధించింది. కోల్ కత్తాకు చెందిన కంపెనీలు జైట్రాన్ సిస్టమ్స్, వీనస్ సాప్ట్ వేర్స్, వీనస్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ నెట్ వింగ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నైకి చెందిన ఫర్ ఫెక్ట్ డ్రెడ్జింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్ అర్పుతరాజ్ , జాబ్ రాబిన్సన్ లను కూడా కుట్ర, మోసం ఆరోపణలతో ప్రపంచ బ్యాంక్ నిషేధించింది.

అవినీతి ఆరోపణలతో 2022లో ఆరు భారతీయ సంస్థపై ప్రపంచ బ్యాంక్ నిషేధించింది. చెన్నైకి చెందిన లోట్టె డేటా కమ్యూనికేషన్ ఆర్ అండ్ డి సెంటర్ ఇండియా ఎల్ఎల్ పీ, హైదరాబాద్ కు చెందిన మధుకాన్ మెగా మాల్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధసంస్థలు, మధురై-ట్యూటికోరిన్ ఎక్స్ ప్రెస్ వేస్ లిమిటెడ్, నమ్మ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మధుకాన్ హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మధుకాన్ ఇన్ ఫ్రా లిమిటెడ్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

వ్యర్థ పదార్ధాల నిర్వహణ కంపెనీల్లో గురుగ్రామ్ ప్రధాన కార్యాలయం కలిగిన A2Z వేస్ట్ మేనేజ్ మెంట్ కు చెందిన రెండు కంపెనీలు 2021 లో ప్రపంచబ్యాంక్ చేతిలో నిషేధానికి గురయ్యాయి. ఈ సంస్థకు చెందిన A2Z వేస్ట్ మనేజ్ మెంట్ నైనిటాల్ ప్రైవేట్ లిమిటెడ్, A2Z వేస్ట్ మేనేజ్ మెంట్ జైపూర్ లిమిటెడ్ సంస్థలపై నిషేధం విధించింది వరల్డ్ బ్యాంక్. ఈ గ్రూప్ లోని A2Z పవర్ టెక్ లిమిటెడ్, A2Z ఇన్ ఫ్రా సర్వీసెస్ లిమిటెడ్ , A2Z పవర్ కామ్ లిమిటెడ్, మాన్సి బిజిలీ అండ్ రైస్ మిల్స్ లిమిటెడ్, ఎకోగ్రీన్ ఎన్విరోటెక్ సొల్యూషన్స్ లిమిటెడ్, మ్యాజిక్ జెనీ స్మార్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్, A2Z వేస్ట్ మేనేజ్ మెంట్ ఆలిగఢ్ లిమిటెడ్, A2Z వేస్ట్ మేనేజ్ మెంట్ లూథియానా లిమిటెడ్, రిషికేశ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ (గతంలో దీన్ని A2Z పవర్ టెక్ లిమిటెడ్ అని పిలిచేవారు) లపై 2021లో ప్రపంచబ్యాంక్ బ్యాన్ చేసింది.

A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ (గతంలో A2Z నిర్వహణ, ఇంజనీరింగ్ సర్వీసెస్ అని పిలిచేవారు) తొలి సారిగా 2020 నవంబర్ లో నిబంధనలు ఉల్లంఘించారని ప్రపంచబ్యాంకు నిషేధించింది. వ్యర్థాల నిర్వహణలో ఒప్పందాలను ఉల్లంఘించినందుకు ఈ గ్రూప్ ఇప్పుడు అనేక మున్సిపల్ కార్పోరేషన్లలో చట్టపరమైన చర్యలను ఎదుర్కొంది. దానిలోని కొన్ని కంపెనీలు కూడా మూసివేశారు. లంచం, మోసపూరిత పద్దతుల అవలంభించారనే 2016లో పది కంటే ఎక్కువ భారతీయ కంపెనీలపై ప్రపంచబ్యాంక్ వేటేసింది. 1999 నుంచి ప్రపంచబ్యాంక్ నిషేధించిన జాబితాలో 50కిపైగా కంపెనీలున్నాయి.

Latest News