World’s Largest Shivalinga| ప్రతిష్టాపనకు సిద్దమైన..ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం

ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్టాపనకు సిద్దమైంది. బీహార్‌లోని తూర్పు చంపారన్‌లోని చాకియాలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయంలో త్వరలో అతిపెద్ద శివలింగం ప్రతిష్టంచబోతున్నారు.

విధాత : ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం(World’s Largest Shivalinga) ప్రతిష్టాపనకు సిద్దమైంది. బీహార్‌(Bihar)లోని తూర్పు చంపారన్‌(East Champaran)లోని చాకియా(Chakia)లో నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయం(Virat Ramayan Temple)లో త్వరలో అతిపెద్ద శివలింగం ప్రతిష్టంచబోతున్నారు. గ్రానైట్‌తో తయారు చేయబడిన ఈ శివలింగం నిర్మించడానికి తమిళనాడు శిల్పులకు 10 సంవత్సరాల సమయం పట్టింది. 96 చక్రాల లారీ ట్రక్కులో తమిళనాడు నుండి ఈ భారీ బాహుబలి శివాలయాన్ని బీహార్‌కు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో “ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయం” నిర్మాణ పనులు రూ.500కోట్ల అంచనా వ్యయంతో 2023 జూన్ 20న ప్రారంభమయ్యాయి. మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి, పాట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్, రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్. ఝాలు ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం కంబోడియాలోని 12వ శతాబ్దపు అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయం కంటే ఎత్తుగా ఉండేలా డిజైన్ చేశారు.

రాష్ట్ర రాజధాని పాట్నా నుండి దాదాపు 120 కి.మీ దూరంలో తూర్పు చంపారన్ జిల్లాలోని కేసరియా-చాకియా రహదారిపై కళ్యాణూర్ బ్లాక్ కింద కైత్వాలియా-బహువారా గ్రామాలలో 3.76 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ ఆలయం నిర్మించబడుతుంది. మూడంతస్తుల ఈ ఆలయంలో 12 గోపురాలు ఉంటాయి, వీటిలో ఎత్తైనది 270 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ఆలయంలోని దేవతలకు 22 గర్భగుడిలను నిర్మిస్తున్నారు. ఈ ఆలయం 2,800 అడుగుల పొడవు, 1,400 అడుగుల వెడల్పు, 405 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ సముదాయంలోనే కల్యాణ మండపాలు, అతిథి గృహాలు కూడా నిర్మిస్తుండటం విశేషం.

Latest News