- ఒకరు మృతి.. 30 మందికి అస్వస్థత
- వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం
- కర్ణాటకలో కొప్పాల్ జిల్లాలో ఘోరం
విధాత: పబ్లిక్ నల్లా ద్వారా వచ్చిన కలుషిత నీరు ఒకరు చనిపోయారు. మరో 30 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ దారుణ ఘటన కర్ణాటక (Karnataka) లోని కొప్పాల్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది.
వర్షాల వల్ల తాగునీరు కలుషితమైందని అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. నల్లాల ద్వారా వచ్చిన కలుషిత నీటిని తాగడం వల్లే గ్రామానికి చెందిన 65 ఏండ్ల మహిళ చనిపోయిందని గ్రామస్థులు విమర్శించారు.
గత నెలలో రాయ్‌చూర్‌లో కూడా కలుషిత నీరు తాగి ఒక బాలుడు మరణించాడు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా ప్రజలకు రక్షిత తాగునీటిని అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.