Site icon vidhaatha

Mumbai | ముంబై పోలీసుల‌కు.. ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన పదేండ్ల బాలుడు

Mumbai |

విధాత‌: ప‌దేండ్ల బాలుడు ముంబై పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. ఒక్క‌ఫోన్ కాల్‌తో ఉరుకులు ప‌రుగులు పెట్టించి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చివ‌రికి బాలుడి ప‌రిస్థితి తెలుసుకొని పోలీసులు జాలి ప‌డ్డారు.

అస‌లేం జ‌రిగిందంటే.. ఆర్థిక రాజ‌ధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని విమానంలో బాంబు ఉన్న‌ట్టు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు గురువారం రాత్రి ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ వ‌చ్చింది.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఫోన్ వ‌చ్చిన కాల్‌ను ట్రేస్ చేయ‌గా, మ‌హారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు బెదిరింపు కాల్‌ చేసిన‌ట్టు విచార‌ణ‌లో తేలింద‌ని ఒక సీనియ‌ర్ అదికారి శుక్ర‌వారం వెల్ల‌డించారు. బాలుడు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, చికిత్స పొందుతున్నాడని పోలీసులు గుర్తించారు.

Exit mobile version