Site icon vidhaatha

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 14 మంది మృతి

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని రెవా జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సుహాగీ పహరీ ఏరియాలో ఓ ప్రయివేటు బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఉత్తరప్రదేశ్ కు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version