Rajasthan | కోట‌లో.. మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌! వారంలోనే ముగ్గురు.. ఏడాదిలో 21 మంది సుసైడ్‌

Rajasthan | విధాత‌: రాజ‌స్థాన్‌ (Rajasthan) లోని కోట నగ‌రంలో గురువారం మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ‌డిచిన వారం రోజుల్లో కోట‌లో ఇలా విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డటం ఇది మూడో ఘ‌ట‌న‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆజంగ‌ఢ్‌కు చెందిన మ‌నీశ్ ప్ర‌జాప‌త్ (Manish Prajapat) (17) కోట‌లోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంట‌ర్‌లో ఆరు నెలలుగా జేఈఈకి శిక్ష‌ణ పొందుతున్నాడు. గురువారం త‌న గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే, ఘ‌ట‌నాస్థ‌లంలో ఎలాంటి సూసైడ్ నోటు ల‌భించ‌లేద‌ని […]

  • Publish Date - August 11, 2023 / 03:41 AM IST

Rajasthan | విధాత‌: రాజ‌స్థాన్‌ (Rajasthan) లోని కోట నగ‌రంలో గురువారం మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ‌డిచిన వారం రోజుల్లో కోట‌లో ఇలా విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డటం ఇది మూడో ఘ‌ట‌న‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆజంగ‌ఢ్‌కు చెందిన మ‌నీశ్ ప్ర‌జాప‌త్ (Manish Prajapat) (17) కోట‌లోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంట‌ర్‌లో ఆరు నెలలుగా జేఈఈకి శిక్ష‌ణ పొందుతున్నాడు.

గురువారం త‌న గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే, ఘ‌ట‌నాస్థ‌లంలో ఎలాంటి సూసైడ్ నోటు ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కోట‌ (Kota) లో ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 21 మంది విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

కోట (Kota) న‌గ‌రం జాతీయ స్థాయి పోటీ ప‌రీక్ష‌ల కోచింగ్‌ సెంట‌ర్ల‌కు ప్రసిద్ధి. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన విద్యార్థులు ఇక్క‌డ‌కు వ‌చ్చి జేఈఈ (JEE) వంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. చ‌దువులో ఒత్తిడిని త‌ట్టుకోలేక‌, ఇత‌ర కార‌ణాల‌తో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌నలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి.

Latest News