Lovers | అర్ధ‌రాత్రి ప్రియురాలి ఇంట్లో ప్రియుడు.. ఆక‌లిగా ఉన్నందుకే వ‌చ్చానన్న బాయ్ ఫ్రెండ్..!

Lovers | ఓ యువ‌కుడు త‌న ప్రియురాలి కోసం అర్ధ‌రాత్రి వేళ పెద్ద సాహ‌స‌మే చేశాడు. ఏకంగా త‌న ప్రియురాలి ఇంట్లోకి ప్ర‌వేశించి, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. తాను ఆ యువ‌తి కోసం రాలేద‌ని, దొంగ‌ను కూడా కాదని, ఆక‌లిగా ఉండ‌డంతో వ‌చ్చాన‌ని బాధిత యువ‌కుడు తెలిపాడు.

  • Publish Date - June 19, 2024 / 07:40 AM IST

Lovers | లక్నో : ఓ యువ‌కుడు త‌న ప్రియురాలి కోసం అర్ధ‌రాత్రి వేళ పెద్ద సాహ‌స‌మే చేశాడు. ఏకంగా త‌న ప్రియురాలి ఇంట్లోకి ప్ర‌వేశించి, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. తాను ఆ యువ‌తి కోసం రాలేద‌ని, దొంగ‌ను కూడా కాదని, ఆక‌లిగా ఉండ‌డంతో వ‌చ్చాన‌ని బాధిత యువ‌కుడు తెలిపాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అజంఘ‌ర్ జిల్లాలో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే… అజంఘ‌ర్ జిల్లా దేవ్‌గ‌న్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన యువ‌తిని ఓ యువ‌కుడు గ‌త కొన్నేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే వారం రోజుల క్రితం అర్ధ‌రాత్రి వేళ త‌న ప్రియురాలి ఇంటికి ఆ యువ‌కుడు వెళ్లాడు. ఇక ఆ ఇంట్లో ఉన్న ఓ ర‌హ‌స్య ప్రాంతంలో త‌ల దాచుకున్నాడు. అయితే యువ‌కుడు గ్రామంలోకి ప్ర‌వేశించిన విష‌యాన్ని కొంద‌రు గ‌మ‌నించి, యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు.

దీంతో అమ్మాయి కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మై ట్రంకులో దాచుకున్న అత‌న్ని బ‌య‌ట‌కు లాగారు. చెంప‌ల‌పై వాయించారు. క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. తాను అమ్మాయి కోసం రాలేదు. దొంగ‌ను కూడా కాదు. కేవ‌లం ఆక‌లిగా ఉండ‌డంతోనే ఏదైనా తిందామ‌ని వ‌చ్చాను అంటూ రెండు చేతులు జోడించి వేడుకున్నాడు. అంత‌లోపే పోలీసులు కూడా ఘట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

యువ‌కుడి త‌ల్లిదండ్రులు ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. అమ్మాయి అంగీకారంతోనే త‌మ అబ్బాయికి వారింటికి వెళ్లాడ‌ని తెలిపారు. ఇంట్లో కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మ‌య్యేస‌రికి ల‌వ‌ర్‌ను ట్రంకులో యువ‌తి దాచిపెట్టింద‌ని వారు పేర్కొన్నారు.

Latest News