Viral Video | ఒక్క అబ్బాయి కోసం జుట్లు ప‌ట్టుకున్న ఇద్ద‌ర‌మ్మాయిలు.. వీడియో

Viral Video | ఇది విచిత్రం.. ఒక్క అబ్బాయి( Boy Friend ) కోసం ఇద్ద‌రు అమ్మాయిలు( Girls ) న‌డిరోడ్డుపై జుట్లు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌( Maharashtra )లోని పుణె( Pune )లో శుక్ర‌వారం సాయంత్రం చోటు చేసుకుంది.

Viral Video | ఒక్క అబ్బాయి కోసం జుట్లు ప‌ట్టుకున్న ఇద్ద‌ర‌మ్మాయిలు.. వీడియో

Viral Video | అది పుణె( Pune )లోని యెర‌వాడ( Yerawada ) ప్రాంతం. న‌డిరోడ్డుపై రెండు గ్రూపుల‌కు చెందిన అమ్మాయిలు( Girls ) హంగామా సృష్టించారు. ఇద్ద‌రు అమ్మాయిలు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు.. ఓ అబ్బాయిని ల‌వ్( Love ) చేస్తున్నారు. వీరిద్ద‌రూ అత‌డికి మేసేజ్‌లు పంపుతున్నారు. ఈ మేసేజ్‌ల విష‌యంలోనే ఇద్ద‌ర‌మ్మాయిల మ‌ధ్య వివాదం త‌లెత్తెంది. ఇంకేముంది ఆ వివాదం కాస్త జుట్లు ప‌ట్టుకుని కొట్టుకునే దాకా దారి తీసింది. అదేదో నాలుగు గోడ‌ల మ‌ధ్య కూడా కాదు.. న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే త‌న్నుకున్నారు.. కొట్టుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడ‌యా( Social Media )లో వైర‌ల్ అవుతున్నాయి. అమ్మాయిల ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అబ్బాయి కోసం అమ్మాయిలు ఈ రేంజ్‌లో కొట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు. దీనికంత‌టికి కార‌ణం త‌ల్లిదండ్రులే అని కొంద‌రు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఆ అమ్మాయిల‌ను మంద‌లించారు. మ‌రి మీరు ఓ లుక్కేయండి అమ్మాయిల‌ గొడ‌వ‌పై..