Samantha – Raj | భూత శుద్ది పద్దతిలో జరిగిన సమంత వివాహం.. దీనికి కారణం ఏంటి?
Samantha - Raj | టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన రెండో వివాహాన్ని అధికారికంగా ప్రకటించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరు (Raj & DK ఫేమ్)తో ఆమె డేటింగ్‌లో ఉందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో, డిసెంబర్ 1 ఉదయం ఆమె స్వయంగా ఆ వార్తలకు ధృవీకరణ ఇచ్చింది.
Samantha – Raj | టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన రెండో వివాహాన్ని అధికారికంగా ప్రకటించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరు (Raj & DK ఫేమ్)తో ఆమె డేటింగ్‌లో ఉందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో, డిసెంబర్ 1 ఉదయం ఆమె స్వయంగా ఆ వార్తలకు ధృవీకరణ ఇచ్చింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ—”A new beginning” అంటూ ప్రకటించడంతో సినీ పరిశ్రమ, అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈషా యోగా సెంటర్‌లో నిర్వహించే అరుదైన ‘భూత శుద్ధి వివాహం’ పద్ధతిలో సమంత పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
లింగ భైరవి సన్నిధిలో ఏడు అడుగులు… పవిత్ర భూత శుద్ధి వివాహం
సోమవారం ఉదయం కోయంబత్తూర్‌లోని ఈశా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధి వద్ద సమంత – రాజ్ నిడిమూరు పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక సంప్రదాయ యోగిక్ విధానాల ప్రకారం జరిగింది. ఈశా ఫౌండేషన్ అధికారిక ప్రకటనలో ..భూత శుద్ధి వివాహం అనేది వేల సంవత్సరాలుగా వస్తున్న యోగా సంప్రదాయంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఈ వివాహం దంపతుల మధ్య ఆలోచన, భావోద్వేగాలు, శరీర శక్తులను శుద్ధి చేసి పంచభూతాల సమతుల్యత కలిగించేందుకు రూపొందించబడింది. జీవిత ప్రయాణంలో శ్రేయస్సు, సామరస్యం, ఆధ్యాత్మిక అనుసంధానం పెరగడానికి ఈ విభిన్నమైన శక్తి పద్ధతి ఉపయోగపడుతుంది. లింగ భైరవి దేవి అనుగ్రహంతో కొత్త జంటకు దీవెనలు లభిస్తాయని ఫౌండేషన్ పేర్కొంది.
భూత శుద్ధి పెళ్లి అంటే ఏమిటి?
ఈ ప్రత్యేక పద్ధతి గురించి చాలా మందికి తెలియదు. ఈశా ఫౌండేషన్ వివరణ ప్రకారం.. ఇది సాధారణ హిందూ వివాహం కాదు. వధూవరుల శరీరంలో ప్రస్ఫుటించే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం శుద్ధికరణే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. వివాహ బంధం ఆధ్యాత్మికంగా ఆరంభం అవ్వాలని, దాంపత్యం కేవలం భావోద్వేగమైనది కాకుండా శక్తి స్థాయిలోనూ అనుసంధానమవ్వాలని ఈ పద్ధతి సిద్ధాంతం. వధూవరులు లింగ భైరవి సన్నిధిలో నిర్దిష్ట శక్తి విధానాలు, ఆచారాలు, ప్రమాణాల్ని అనుసరిస్తారు.
లింగ భైరవి దేవి – ఈశా కేంద్రంలోని శక్తి స్వరూపం
ఫౌండేషన్ ప్రకటించిన వివరాల ప్రకారం లింగ భైరవి దేవిని సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వయంగా ప్రాణప్రతిష్ట చేశారు. ఇది స్త్రీశక్తికి ప్రతీక అయిన ఉగ్ర కారుణ్య స్వరూపం. ఎనిమిది అడుగుల ఎత్తైన ఈ శక్తి స్వరూపం భక్తుల మనసు, శరీరం, శక్తులను సమతుల్యం చేస్తుందనే నమ్మకం ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి దశలో భక్తులకు ఆధ్యాత్మిక దారిదీపికగా నిలుస్తుందని ఈశా ఫౌండేషన్ పేర్కొంది. మొత్తం మీద సమంత -రాజ్ నిడిమూరు వివాహం టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాశంగా మారింది. ప్రత్యేకంగా భూత శుద్ధి పద్ధతిలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమంత వ్యక్తిగతంగా ఎన్నో కష్టకాలాలు ఎదుర్కొన్న తర్వాత ఈ కొత్త ఆరంభాన్ని ఎంచుకోవడం ఆమె అభిమానులను ఎంతో సంతోషపరుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram