జర్నలిస్టులకు తీపి కబురు: ప్రైవేట్ పాఠ‌శాలల్లో 50 % రాయితీ ఉత్తర్వులు జారీ

జర్నలిస్టులకు అండగా TUWJ.. మంత్రి సబితా, కలెక్టర్ అమోయ్‌కు ధ‌న్య‌వాదాలు.. అధ్యక్ష, కార్యదర్శులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ విధాత‌: రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గాను జర్నలిస్టు పిల్లల చదువుల నిమిత్తం 50శాతం ఫీజు రాయితీ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని TUWJ, IJU జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మంత్రి సబితా రెడ్డికి, కలెక్టర్ ఆమోయ్ కుమార్ గారికి వినతిపత్రం […]

  • Publish Date - November 29, 2022 / 04:30 PM IST
  • జర్నలిస్టులకు అండగా TUWJ..
  • మంత్రి సబితా, కలెక్టర్ అమోయ్‌కు ధ‌న్య‌వాదాలు..
  • అధ్యక్ష, కార్యదర్శులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్

విధాత‌: రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గాను జర్నలిస్టు పిల్లల చదువుల నిమిత్తం 50శాతం ఫీజు రాయితీ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని TUWJ, IJU జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మంత్రి సబితా రెడ్డికి, కలెక్టర్ ఆమోయ్ కుమార్ గారికి వినతిపత్రం ఇచ్చారు. వెంటనే వారు స్పందించి సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవోని ఆదేశించారు.

డీఈఓ వెంటనే అక్రిడేషన్ జర్నలిస్టులకు 50% రాయితీ ఇచ్చే విధంగా ఆర్డర్ కాపీ ఇచ్చారు. దీంతో మంత్రి సబితారెడ్డికి, కలెక్టర్ ఆమోయ్ కుమార్ గారికి జ‌ర్న‌లిస్టుల త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలిపారు.