Site icon vidhaatha

Telangana Project | తెలంగాణ ప్రాజెక్టు–1లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం

Telangana Project

విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం ఎన్‌టీపీసీకి చెందిన తెలంగాణ ప్రాజెక్ట్ ఒకటవ యూనిట్‌లో 8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా అధికారులు, ఉద్యోగులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఎన్‌టీపీసీ నుండి 4 వేల మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి అందించేందుకు నిర్దేశించారు.

ఈ క్రమంలోనే రామగుండం ఎన్‌టీపీసీ వద్ద మొదటి దశలో 800 మెగావాట్లకు చెందిన రెండు సూపర్ క్రిటికల్ విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులను చేపట్టారు, నిర్మాణం పనులు ప్రారంభించిన నాటి నుండి అనేక సాంకేతిక ఇబ్బందులు, కరోనా లాంటి సమస్యలు ఎదురుకావడంతో, నిర్మాణం పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది.

అయితే.. కొద్ది నెలల నుండి తెలంగాణ ప్రాజెక్టుకు చెందిన రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులను ఉద్యోగులు వేగవంతం చేసి ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు.ఆదివారం సాయంత్రం ఒకటవ యూనిట్ నుండి ఉత్పత్తి జరుగుతున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్ కు పంపిణీ చేస్తున్నారు.

తెలంగాణ ప్రాజెక్టు నుండి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో 90% తెలంగాణ రాష్ట్రానికి అందజేస్తున్నారు. మరో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను కూడా కొద్ది రోజుల్లోనే ఉత్పత్తి దశలోకి తీసుకురావడం కోసం సిద్ధం చేస్తున్నారు. ఎన్‌టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు నుండి సకాలంలో విద్యుత్ ఉత్పత్తి జరిగేందుకు కృషి చేసిన ఉద్యోగులందరికీ హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకుడు సీహెచ్ ఉపేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version