-పనిచేసేది 22 రోజులే
విధాత: వచ్చే నెల బ్యాంకులు 22 రోజులే పనిచేయనున్నాయి. 9 రోజులు సెలవులే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి నెలకుగాను దేశీయ బ్యాంకుల సెలవుల జాబితాను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 12 రోజులు సెలవులు వస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు HOLIDAYS ఉన్నాయి. నెలనెలా సాధారణంగా వచ్చే ఆదివారాలు, రెండో, నాల్గో శనివారాల కారణంగా మార్చిలో 6 రోజులు బ్యాంకులు మూతబడుతున్నాయి. అయితే వీటికి అదనంగా మరో 3 రోజులు వచ్చే నెల హోలీ, ఉగాది, శ్రీరామ నవమి సెలవులు వస్తున్నాయి. దీంతో మొత్తం నెలలో 9 రోజులకు సెలవులు చేరుతున్నాయి. అయినప్పటికీ ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా నిరంతరం కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి.
వచ్చే నెల BANK సెలవు దినాలివే..
మార్చి 5: ఆదివారం
మార్చి 8: హోలీ
మార్చి 11: రెండో శనివారం
మార్చి 12: ఆదివారం
మార్చి 19: ఆదివారం
మార్చి 22: ఉగాది
మార్చి 25: నాల్గో శనివారం
మార్చి 26: ఆదివారం
మార్చి 30: శ్రీరామ నవమి