Insta Reels | ప్రాణాల‌ను బ‌లిగొన్న ఇన్‌స్టా రీల్స్.. రైలు ఢీకొన‌డంతో విద్యార్థి మృతి

Insta Reels | స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో ర‌కాల సోష‌ల్ మీడియా అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టా గ్రాం, టెలిగ్రామ్ లాంటి ఎన్నో యాప్స్ మ‌న ముంగిట వాలిపోయాయి. ఈ మాధ్య‌మాల ద్వారా ర‌క‌ర‌కాల వీడియోలు చిత్రీక‌రిస్తూ పాపుల‌ర్ అయ్యేందుకు అమ్మాయిలు, అబ్బాయిలు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాత్రికి రాత్రే సెల‌బ్రెటీ కావాల‌నే ఆలోచ‌న‌తో డేంజ‌ర్ స్టంట్ల‌కు పాల్ప‌డుతున్నారు. ఆ మాదిరిగానే ఓ డిగ్రీ విద్యార్థి.. ఇన్ స్టా రీల్స్ కోసం రైలు ప‌ట్టాల‌పై […]

  • Publish Date - May 5, 2023 / 04:11 PM IST

Insta Reels |

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో ర‌కాల సోష‌ల్ మీడియా అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టా గ్రాం, టెలిగ్రామ్ లాంటి ఎన్నో యాప్స్ మ‌న ముంగిట వాలిపోయాయి. ఈ మాధ్య‌మాల ద్వారా ర‌క‌ర‌కాల వీడియోలు చిత్రీక‌రిస్తూ పాపుల‌ర్ అయ్యేందుకు అమ్మాయిలు, అబ్బాయిలు ప్ర‌య‌త్నిస్తున్నారు.

రాత్రికి రాత్రే సెల‌బ్రెటీ కావాల‌నే ఆలోచ‌న‌తో డేంజ‌ర్ స్టంట్ల‌కు పాల్ప‌డుతున్నారు. ఆ మాదిరిగానే ఓ డిగ్రీ విద్యార్థి.. ఇన్ స్టా రీల్స్ కోసం రైలు ప‌ట్టాల‌పై నిల్చుని ఉండ‌గా, రైలు ఢీకొట్టింది. దీంతో ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్ రైల్వే ట్రాక్‌పై చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌కు చెందిన మ‌దార్సా విద్యార్థి స‌ర్ఫ‌రాజ్‌(16) త‌న ఇద్ద‌రు ఫ్రెండ్స్‌తో క‌లిసి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం స‌న‌త్‌న‌గ‌ర్ రైల్వేస్టేష‌న్‌కు చేరుకున్నారు. అక్క‌డ ప‌ట్టాల‌పై నిల్చుని ఇన్ స్టా రీల్స్ కోసం వీడియోలు తీసుకుంటున్నారు. అంత‌లోనే వేగంగా వ‌చ్చిన ఓ రైలు స‌ర్ఫ‌రాజ్‌ను ఢీకొట్టింది. స‌ర్ఫ‌రాజ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇన్ స్టా రీల్స్ కోస‌మే ప‌ట్టాల‌పై నిల్చుని వీడియోలు తీసుకుంటుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

Latest News