Rains | హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి దంచికొట్టిన వాన‌

Rains | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం రాత్రి వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత అంటే బుధ‌వారం తెల్ల‌వారుజామున ఒంటి గంట నుంచి 2 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొట్టింది.

Rains | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం రాత్రి వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత అంటే బుధ‌వారం తెల్ల‌వారుజామున ఒంటి గంట నుంచి 2 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన దంచికొట్టింది. న‌గ‌ర వ్యాప్తంగా మోస్త‌రు వ‌ర్షం కురిసింది. దీంతో ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్లు అయింది. ఉరుములు, మెరుపులు మెరిశాయి. చ‌ల్ల‌ని గాలులు వీచ‌డంతో పూర్తిగా వాతావ‌ర‌ణం మారిపోయింది.

మ‌హేశ్వ‌రం, షాద్‌న‌గ‌ర్, శంషాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్, బండ్ల‌గూడ జాగీర్, బ‌హ‌దూర్‌పురా, కార్వాన్, కాటేదాన్, బార్క‌స్, చాంద్ర‌య‌ణ‌గుట్ట‌, చార్మినార్, ఎల్‌బీ న‌గ‌ర్, స‌రూర్ న‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం, దిల్‌సుఖ్‌న‌గ‌ర్, సంతోష్‌న‌గ‌ర్, చాద‌ర్‌ఘాట్, కోఠి, న‌ల్ల‌కుంట‌, రాంన‌గ‌ర్, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, సికింద్రాబాద్, ఖైర‌తాబాద్, బేగంపేట్, పంజాగుట్ట‌, సోమాజిగూడ‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీప‌ట్నంతో పాటు ప‌లు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వికారాబాద్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లోనూ వ‌ర్షం కురిసింది. అకాల వ‌ర్షానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామిడి పంట‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ఈదురుగాలుల నేప‌థ్యంలో మామిడి కాయ‌లు నేల‌రాల‌యి. వ‌రి ధాన్యం కూడా అక్క‌డ‌క్క‌డ త‌డిసిపోవ‌డంతో రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉంది.

Latest News