Viral Video |
విధాత: ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మండుటెండలకు చెట్ల కింద సేదతీరడమో, లేదంటే బావుల్లో ఈతకు వెళ్లడం చేస్తుంటారు మనషులు.
మరి ఇతర జంతువులు (Animals), సరీసృపాలు (Reptiles) కూడా ఈ మండుటెండలను తట్టుకోలేక పోతున్నాయి. సరీసృపాలు అయితే వేడిని తట్టుకోలేక బొరియల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. చల్లని ప్రదేశాలకు లేదా నీళ్లుండే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి పాములు.
ఉక్కపోతకు గురవుతూ ఇబ్బంది పడుతున్న ఓ నాగుపాము(King Cobra)ను ఓ యువకుడు గుర్తించాడు. దానికి బకెట్‌లో ఉన్న నీటితో స్నానం చేయించాడు. తన శరీరానికి నీళ్లు తగలడంతో పాముకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లు అయింది.
చూసే వారి గుండెలు జారాల్సిందే.. మనిషి లోతు పడగ విప్పిన నాగుపాము
ఇక నీళ్లు పోస్తున్నంత సేపు ఆ పాము ఎలాంటి హానీ కలిగించలేదు. దాని పడగ మీద కూడా ఆ యువకుడు చేతితో టచ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.