KA Paul – Naveen Polishetty |
కొన్ని కలయికలు అనుకోకుండా జరగడం, ఆ సమయంలో ఒకరినొకరు పలకరించుకోవడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి కలయిక ఒకటి జరగగా, అది చూసి ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా పేరున్న కేఏపాల్.. సిల్వర్ స్క్రీన్ ఎంటర్ టైనర్‌గా పేరున్న నవీన్ పొలిశెట్టి ఇద్దరు అనుకోకుండా ఎదురు పడడం.. ఒకరినొకరు హాయ్ చెప్పుకోవడం చూసి ప్రతి ఒక్కరికి చాలా విచిత్రంగా అనిపించింది.
ఇందుకు సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. మేటర్‌లోకి వెళితే… నవీన్ పొలిశెట్టి… టాలీవుడ్‌లో మంచి కామెడీ టైమింగ్ వున్న హీరో. ప్రజా శాంతి పార్టీ అధినేత అయిన కేఎ పాల్ తన వింత చేష్టలతో ప్రజలను కడుపుబ్బా నవ్వించే పొలిటీషియన్.
వీరిద్దరు మాత్రం మంచి సందడి పంచుతారు. అయితే ఈ ఇద్దరు కూడా వైజాగ్‌లో ఒకరికొకరు ఎదురుపడటం ఆసక్తికరంగా అనిపించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా, అనుష్క హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి… మిస్టర్ పొలిశెట్టి’ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.
KA Paul & Mr. Polishetty pic.twitter.com/oFyvNyrg6U
— Aakashavaani (@TheAakashavaani) August 28, 2023
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నవీన్ పలు ప్రాంతాలు తిరుగుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాలను చుట్టేసిన ఈ హీరో వైజాగ్ కూడా వెళ్లారు. అక్కడ వైజాగ్ బీచ్ రోడ్డులో వెళుతున్న సమయంలో కేఏ పాల్ ఎదురు పడ్డాడు. కేఏ పాల్ కూడా ప్రస్తుతం వైజాగ్ లోనే ఉండగా, ఆయన కొందరు యువకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న నవీన్ పొలిశెట్టి తన కారును ఆపి కేఏ పాల్ ను పలకరించారు.
అప్పుడు కేఏ పాల్ కూడా నవీన్ కు హాయ్ చెబుతూ ఏదో మాట్లాడారు. అయితే ట్రాఫిక్ లో కారు ఎక్కువ సేపు ఆపలేక నవీన్ ముందుకు వెళ్లిపోయాడు. మొత్తానికి ఇద్దరు ఒకరినొకరు టాప్ రూఫ్ నుండి పలకరించుకోవడం విశేషం. వీరిద్దరు అలా పలకరించుకోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాలలోను చర్చనీయాంశం అయింది.
ఇక నవీన్ సినిమాలో అనుష్క కథానాయికగా నటించగా, ఈ చిత్రాన్ని మహేష్ బాబు పి తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించగా, ఇందులో అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా ముఖ్య పాత్రల్లో నటించారు. రథన్ సంగీతం సమకూర్చారు.
KA Paul & Mr. Polishetty pic.twitter.com/oFyvNyrg6U
— Aakashavaani (@TheAakashavaani) August 28, 2023