Rishi Sunak | బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌లకు ఎదురుదెబ్బ

విధాత: బ్రిటన్ స్థానిక ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లేబర్‌ పార్టీ విజయ పతాకాన్ని ఎగురవేసింది. బ్రిటన్‌లోని 230 జిల్లాల్లో 8000 కౌన్సిల్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ముమ్మరంగా జరుగుతున్నది. ఇప్పటివరకు 62 కౌన్సిళ్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ కౌన్సిళ్లలో 228 స్థానాలలో కన్సర్వేటివ్‌లు ఓడిపోయారు. వారు ఇప్పటి వరకు గతంలో గెలిచిన స్థానాల్లో మూడింట ఒక వంతు స్థానాలను కోల్పోయారు. పశ్చిమ […]

  • Publish Date - May 5, 2023 / 12:42 AM IST

విధాత: బ్రిటన్ స్థానిక ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లేబర్‌ పార్టీ విజయ పతాకాన్ని ఎగురవేసింది. బ్రిటన్‌లోని 230 జిల్లాల్లో 8000 కౌన్సిల్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ముమ్మరంగా జరుగుతున్నది.

ఇప్పటివరకు 62 కౌన్సిళ్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ కౌన్సిళ్లలో 228 స్థానాలలో కన్సర్వేటివ్‌లు ఓడిపోయారు. వారు ఇప్పటి వరకు గతంలో గెలిచిన స్థానాల్లో మూడింట ఒక వంతు స్థానాలను కోల్పోయారు.

పశ్చిమ లండన్‌లోని విండ్సార్, మెయిడెన్హెడ్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రతిపక్ష సెంట్రిస్టు పార్టీ విజయం సాధించింది. నైరుతి ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్, ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని మిడ్వే, స్టోక్ ఆన్‌స్టరెంట్‌ వంటి ప్రాంతాల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. కష్టపడి పనిచేసిన కన్సర్వేటివ్ కౌన్సిలర్లు ఓడిపోవడం నిరాశ కలిగించింది అని సునాక్ వ్యాఖ్యానించారు.