Red Bulb |
విధాత: మనం ఇష్టపడే వ్యక్తి మనకు దూరమైనా.. చనిపోయినా ఆ వ్యక్తిని ప్రతి నిత్యం గుర్తు చేసుకుంటాం. వారితో అనుబంధాన్ని నెమరేసుకుంటాం. అంతే కాదు.. వారి జ్ఞాపకార్థం కొన్ని మంచి పనులు చేస్తుంటాం.. ఆ మాదిరిగానే ఓ యువతి కూడా తన తాతయ్య దుస్థితి మరెవరికీ రావొద్దని.. సైకిళ్లకు 1500 రెడ్ బల్బ్‌లను (Red Bulb) ఉచితంగా అమర్చింది. ఎందుకంటే..
ఓ వృద్ధుడు సైకిల్‌పై వెళ్తూ.. రోడ్డుప్రమాదానికి గురై 2020లో చనిపోయాడు. ఆ వృద్ధుడికి ఖుషి అనే మనుమరాలు ఉంది. అయితే తాతయ్య సైకిల్‌పై చీకట్లో వెళ్తుండగా, కారు ఢీకొట్టింది. దీంతో తాత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తాత సైకిల్‌కు వెనుకాల రెడ్ బల్బ్ ఉండి ఉంటే ఆ ప్రమాదం నుంచి బయటపడే వాడేమో అని, ఇతర వాహనాలకు ముందు వెళ్తున్న సైకిల్ కనిపించేదని ఖుషి భావించింది. దీంతో తన తాతయ్య దుస్థితి మరెవరిరీ రావొద్దని భావించి, ఇప్పటి వరకు 1500 సైకిళ్లకు రెడ్ బల్బ్‌లను ఉచితంగా అమర్చి, ప్రశంసలు అందుకుంటుంది. వీధుల్లో ప్లకార్డులు ప్రదర్శించి రెడ్ బల్బ్ ప్రాధాన్యతను వివరిస్తుంది ఖుషి.