Site icon vidhaatha

Satyendar Jain | జైలు వాష్‌రూంలో జారి ప‌డ్డ.. ఆప్ మాజీ మంత్రి

విధాత‌: వాష్‌రూంలో జారి ప‌డిపోవ‌డంతో ఆప్ నేత‌, దిల్లీ మాజీ మంత్రి స‌త్యేంద్ర జైన్ (Satyendar Jain) న‌డుముకు స్వ‌ల్ప‌ గాయాలైన‌ట్లు తిహార్‌ జైలు అధికారులు గురువారం వెల్ల‌డించారు. వెంట‌నే వైద్యులు ఆయ‌న‌ను ప‌రిశీలించి తీవ్ర గాయామేమీ కాలేద‌ని చెప్పార‌న్నారు.

అయితే భుజం, న‌డుము, ఎడ‌మ కాలు తీవ్రంగా బాధిస్తున్నాయ‌ని జైన్ చెప్ప‌డంతో ఆయ‌న‌ను దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని అధికారులు పేర్కొన్నారు. ఆయ‌నకు ప్ర‌మాద‌మేమీ లేద‌ని అక్క‌డి వైద్యులు సైతం ధ్రువీక‌రించార‌న్నారు.

న‌గ‌దు అక్ర‌మ లావాదేవీల చ‌ట్టం (పీఎంఎల్ ఏ) కింద గ‌తేడాది మే 30న జైన్‌ను ఈడీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న తిహార్‌ జైలులో ఉంటున్నారు.

Exit mobile version