Site icon vidhaatha

Posani Krishna Murali | సినీ నటుడు పోసానికి కరోనా.. ఆసుపత్రిలో చేరిక..!

Posani Krishna Murali | సినీ నటుడు, రచయిత, డైరెక్టర్‌ పోసాని కృష్ణ మురళీ కరోనా మహమ్మారి బారినపడ్డారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో పోసాని చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల పూణేలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఒంట్లో నలతగా ఉండడంతో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇంతకు ముందు సైతం ఆయనకు రెండుస్లారు కరోసా సోకింది.

పోసాని కృష్ణ మురళీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒకే రోజు 45 కేసులు రికార్డయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లోనే 18 కేసులున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మాస్క్‌లు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

Exit mobile version