MLC కవితతో.. నటుడు శరత్‌కుమార్‌ భేటీ..!

విధాత: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ తమిళ నటుడు, ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల గురించి ఇరువురు చర్చించనట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ స్థాపన, ఉద్దేశం, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరద్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఒడిషా మాజీ సీఎ గిరిధర్‌ గమాంగ్‌, ఆయన భార్య […]

  • Publish Date - January 28, 2023 / 07:33 AM IST

విధాత: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ తమిళ నటుడు, ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల గురించి ఇరువురు చర్చించనట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ స్థాపన, ఉద్దేశం, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరద్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఒడిషా మాజీ సీఎ గిరిధర్‌ గమాంగ్‌, ఆయన భార్య హేమ గమాంగ్‌, ఆయన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, నవనిర్మాణ్‌ కిసాన్‌ సంఘటన్‌ కన్వీనర్‌, ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతు సంఘాల నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపత్యంలో శరత్‌కుమార్‌ ఎమ్మెల్సీ కవితతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.