Adipurush |
విధాత: చాన్నాళ్ల నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది సినిమాహాళ్లు ఆదిపురుష్‌తో నిండి పోయాయి. వీధులు… మార్కెట్లు, హాలు పరిసర ప్రాంతాలు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తాయి. అభిమానులు మొన్నటి నుంచీ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. వేకువజాము షోకు జనం ఎగబడ్డారు.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు టికెట్ మీద యాభై పెంచుకునేందుకు నిర్మాతలు,ఎగ్జిబిటర్స్ కు అనుమతులు ఇచ్చారు. ముందే చెప్పినట్లు ప్రతి హాల్లోనూ ఒక కుర్చీ హనుమాన్ కు రిజర్వ్ చేశారు. ఆ కుర్చీలో ఇంకెవరూ కూర్చోకుండా దానిలో హనుమాన్ చిత్ర పటాన్ని ఉంచారు.
ఇక హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో ఆ చైర్లో కూర్చున్న ఒక ప్రేక్షకుడిని ప్రభాస్ అభిమానులు దాడి చేసి కొట్టారు. భగవాన్ హనుమాన్‌కు కేటాయించిన చైర్లో ఎలా కూచుంటావ్ అని ప్రశ్నించి కొట్టారు.
అయితే ఆయన మద్యం తాగి కూర్చున్నట్లు చెప్పడంతో వదిలేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి హాసన్ శ్రీరామ్ జానకి పాత్ర దారులుగా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. వందల కోట్ల బడ్జట్ తో నిర్మితమైన ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది.
Frustrated Fans