Bengal Tiger | ఢిల్లీ జూపార్కులో 18 ఏండ్ల త‌ర్వాత పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన బెంగాల్ టైగ‌ర్

Bengal Tiger | ఢిల్లీ జూ పార్కులో 18 ఏండ్ల త‌ర్వాత బెంగాల్ టైగ‌ర్ ఐదు పులి పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఐదింటిలో మూడు పులి పిల్ల‌లు చ‌నిపోయాయి. రెండు మాత్ర‌మే ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ విష‌యాన్ని ఢిల్లీ జూ పార్కు డైరెక్ట‌ర్ ఆకాంక్ష మ‌హాజ‌న్ వెల్ల‌డించారు. మే 4వ తేదీన సిద్ధి అనే బెంగాల్ టైగ‌ర్ ఐదు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు పేర్కొన్నారు. రెండు మాత్ర‌మే ఆరోగ్యంగా ఉన్నాయ‌ని తెలిపారు. సిద్ధితో పాటు దాని ఇద్ద‌రు పిల్ల‌ల‌ను […]

  • Publish Date - May 16, 2023 / 02:34 AM IST

Bengal Tiger | ఢిల్లీ జూ పార్కులో 18 ఏండ్ల త‌ర్వాత బెంగాల్ టైగ‌ర్ ఐదు పులి పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఐదింటిలో మూడు పులి పిల్ల‌లు చ‌నిపోయాయి. రెండు మాత్ర‌మే ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ విష‌యాన్ని ఢిల్లీ జూ పార్కు డైరెక్ట‌ర్ ఆకాంక్ష మ‌హాజ‌న్ వెల్ల‌డించారు.

మే 4వ తేదీన సిద్ధి అనే బెంగాల్ టైగ‌ర్ ఐదు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు పేర్కొన్నారు. రెండు మాత్ర‌మే ఆరోగ్యంగా ఉన్నాయ‌ని తెలిపారు. సిద్ధితో పాటు దాని ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సీసీటీవీ ద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ జూపార్కులో ప్ర‌స్తుతం నాలు బెంగాల్ టైగ‌ర్లు ఉన్నాయి. క‌ర‌ణ్‌, సిద్ధి, అదితి, బ‌ర్ఖా ఉన్నాయి. ఇందులో సిద్ధి, అదితిని నాగ్‌పూర్‌లోని గోరెవాడ నుంచి కొన్నేండ్ల క్రితం ఢిల్లీ జూకు త‌ర‌లించారు.
అయితే ఢిల్లీ జూపార్కులో చివ‌రిసారిగా 2005, జ‌న‌వ‌రి 16వ తేదీన బెంగాల్ టైగ‌ర్ పులి పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బెంగాల్ టైగ‌ర్ జ‌న్మ‌నివ్వ‌డం ఇప్పుడే.

Latest News