Allu Aravind:
బాహుబలి సినిమా నిర్మాతలకి ఎనలేని ధైర్యం తీసుకొచ్చి పెట్టింది. భారీ ప్రాజెక్ట్‌లు తీసి ప్రేక్షకులని అలరించడమే కాకుండా విపరీతమైన లాభాలు కూడా పొందవచ్చని నిరూపించింది ఈ చిత్రం. బాహుబలి సినిమా తర్వాత చాల మంది దర్శక నిర్మాతలు బడా ప్రాజెక్ట్‌లు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు.
ముఖ్యంగా పురాణాలకి సంబంధించి సినిమాలు తీసే సాహసం చేస్తున్నారు. త్వరలో రాజమౌళి మహాభారతంపై కూడా ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇక స్టార్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ కి రామాయణం డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా, ఇప్పటికే రామాయణం సినిమాపై కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి.
అప్పట్లో చాలా చిత్రాలు రామాయణం ఆధారంగా రూపొందగా, రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్ చిత్రం కూడా రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఇవన్నీ కూడా రామాయణంలోని ముఖ్యమైన పాయింట్స్ ఆధారంగా రూపొందినవే.
ఇప్పుడు అల్లు అరవింద్.. మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి రామాయణం సినిమా నిర్మించాలని అనుకుంటున్నారు. ఎప్పుడో దీనిపై ప్రకటన చేసిన కూడా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో కొందరు సినిమా ఆగిపోయిందని, ఇది తెరకెక్కే అవకాశం లేదని అనుకున్నారు.
కాని తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రాన్ని నిర్మించే ఆలోచనలు చేస్తున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని బాలీవుడ్ మీడియా చెబుతుంది.
ఇక ఈ సినిమాలో రాముడు, సీత లక్ష్మణుడు, హనుమంతుడు, రావణ పాత్రల కోసం కొంత మంది స్టార్స్ ని లుక్ టస్ట్ చేసి ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. రామాయణం నేపథ్యంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో.. రాముడుగా రణ్ బీర్ కపూర్, సీతగా అలియా భట్, రావణుడి పాత్రలో KGF స్టార్ యష్ నటించనున్నారని, ప్రస్తుతం ఈ పాత్రలకు సంబంధించి వీరి మీద లుక్ టెస్ట్ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇది నిజమైతే సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉంటాయి.