Site icon vidhaatha

Ambati Rayudu | గ్రామాల్లో అంబటి రాయుడు పర్యటన.. స్కూల్‌ పిల్లలతో కలిసి భోజనం

క్రికెట్ కు గుడ్ బై చెబుతూ కెరీర్ చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన అంబటి రాయుడు (Ambati Rayudu) కొత్త పాత్రలోకి రాబోతున్నారా ? ఇప్పటికే తనకు రాజకీయాలు అంటే ఇష్టం అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని చెప్పిన ఆయన రాజకేయాల్లోకి వస్తారా? వస్తే ఎక్కడ ? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? చూడాలి.. అయితే ఇప్పటికే అయన జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పలు ట్వీట్స్ చేసి, రెండు మూడు సార్లు నేరుగా జగన్ను కలిశారు.

ఆ తరువాత అయన ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అని చెప్పిన ఆయనకు జగన్ ఏమైనా హామీ ఇచ్చారా ? ఆ ధైర్యంతోనే అయన ఇలా ఉత్సాహంగా ప్రజల్లో తిరుగుతున్నారా ? ఏమో కాలమే సమాధానం చెబుతుంది. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు గుంటూరు, మచిలీపట్నం నుంచి ఎంపీగా లేదా గుంటూరులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.

ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో పునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. తరువాత శౌరివారి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లి పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశాసారు. పాఠశాలలోని సౌకర్యాలు, ఇబ్బందులు, విద్యార్థుల ఫ‌లితాల గురించి అడిగి తెలుసుకున్నారు.

తరువాత మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజల స్థితిగతులను తెలుసుకుంటు న్నానన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకు జగన్ ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ హామీతోనే రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నారని, అందుకే జిల్లాలో తిరుగుతున్నారని అంటున్నారు.

Exit mobile version