Site icon vidhaatha

Elon Musk: అమెరికా త్వరలోనే దివాలా తీస్తుంది : ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk:  ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అగ్రరాజ్యం..సంపన్న దేశం అమెరికా త్వరలోనే దివాలా తీస్తుందట. అవును ఈ మాటలు అన్నది మరెవరో కాదు..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిఫియెన్సీ(డోజ్) బాధ్యతలను నిర్వర్తించి ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. అందుకే అమెరికా దివాలా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ట్రంప్ సర్కార్ తెచ్చిన ట్యాక్స్ బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్ ఇప్పటికే డోజ్ సారధ్య బాధ్యతల నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ అమోదం కోసం వచ్చిన ట్యాక్స్ బిల్లుపై మస్క్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నన్ను క్షమించండి..నేను ఇంతకంటే భరించలేను..‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అత్యంత దారుణమైంది..కాంగ్రెస్ వ్యయ బిల్లు  బిల్లు చాల చెడ్డది. దీంతో అమెరికన్లపై అధిక భారం పడుతుందని తెలిపారు. అది తప్పుడు బిల్లు అని మీకు తెలుసు. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. అయినా ఈ బిల్లుకు మద్దతుగా ఓటేశారంటే అది మీకే అవమానం అని పేర్కొన్నారు. ఈ బిల్లు కారణంగా ద్రవ్యలోటు 2.5ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని..ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దివాలా తీయడం ఖాయమని మస్క్ హెచ్చరించారు.

అంతకుముందు కూడా మస్క్ ట్యాక్స్ బిల్లును వ్యతిరేకించారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు బిల్లు గండికొడుతుందంటూ అసంతృప్తి వెళ్లగక్కారు. అనంతరం డోజ్ సారధ్య బాధ్యతలనుంచి వైదొలిగారు. ట్యాక్స్ బిల్లుకు, ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా గళమెత్తిన మస్క్ కు రిపబ్లిక్ ల నుంచి మద్దతు లభిస్తుంది. మస్క్ వాదన సరైందేనంటూ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ పేర్కొన్నారు.

అయితే ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ చేసిన వ్యాఖ్యలను వైట్ హౌస్ ఖండించింది. మస్క్ అభిప్రాయం ట్రంప్ నిర్ణయాన్ని మార్చబోదని ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిగ్ పేర్కొన్నారు. బిల్లు గొప్పదని..ట్రంప్ బిల్లు ప్రతిపాదనపై కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ బిల్లుపై మస్క్ చేసిన వ్యాఖ్యలు నిరాశపరిచాయని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ పేర్కొన్నారు.

 

Exit mobile version