Amul milk price hike | గుజరాత్‌కు చెందిన ప్రముఖ డెయిరీ కో ఆపరేటివ్ సంస్థ అమూల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పాల ధరను లీటర్‌కు రూ.3 ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని వెల్లడించింది. పెరిగిన ధరతో అమూల్ గోల్డ్ లీటర్ పాల ధర రూ.66 వరకు పెరిగింది. అలాగే అమూల్ ఫ్రెష్ లీటర్‌కు రూ.54, అమూల్ ఆవు పాలు రూ.56, అమూల్ ఏ2 గేదె పాలు లీటర్‌కు రూ.70కి చేరాయి. గతేడాది అక్టోబర్‌లో అమూల్ కంపెనీ లీటర్‌కు రూ.2 చొప్పున ధరను పెంచిన విషయం తెలిసిందే.
నిర్వహణ ఖర్చులు, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతోనే ధరలు పెంచున్నట్లు తెలిపింది. గతేడాదితో పోల్చితే పశుగ్రాసం ధర దాదాపు 20శాతం పెరిగింది. ఇదిలా ఉండగా.. గత డిసెంబర్‌లో మదర్ డెయిరీ ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో లీటర్‌కు రూ.2 చొప్పున పాల ధరను పెంచింది. ఇదిలా ఉండగా.. పాల ధర పెంపు గుజరాత్‌లో వర్తించదని గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) గుజరాత్ మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా స్పష్టం చేశారు. కొత్త ధరలు ముంబయి, కోల్‌కతా, ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లో పెరుగనున్నాయి. కొత్త ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వస్తాయని జీసీఎంఎంసీ ప్రకటనలో తెలిపింది.