Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సాన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత గ్రాండ్‌గా ప్రారంభించారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం, భారతీయ సినీ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతిని ఇవ్వబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
శివరాజ్ కుమార్ లుక్ అదుర్స్..
ఇక ఈ సినిమాకు సంబంధించి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో భారీ ఈవెంట్ మధ్య విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇదిలా ఉంటే, ట్రైలర్‌కు ముందు మేకర్స్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పాత్రను అధికారికంగా పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రేజీ కాంబో అదుర్స్..
‘గౌర్నాయుడు’ అనే పవర్ ఫుల్ పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారని వీడియో ద్వారా వెల్లడించారు. కుస్తీ బరిలో ఆయన ఎంట్రీ, బాడీ లాంగ్వేజ్, మాస్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన చూపించిన ఇంటెన్స్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ఈ వీడియో చూస్తే, ‘పెద్ది’లో గౌర్నాయుడు పాత్ర కథలో ఎంత కీలకంగా ఉండబోతుందో స్పష్టమవుతోంది. రామ్ చరణ్ – శివరాజ్ కుమార్ కాంబినేషన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అభిమానులు భావిస్తున్నారు.
గ్రామీణ వాతావరణం, స్పోర్ట్స్ ఎమోషన్స్, మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘పెద్ది’ ఇప్పటికే పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు వరుస అప్‌డేట్స్‌తో సినిమా హైప్ మరింత పెరుగుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Gournaidu a.k.a @nimmashivanna garu❤️🔥❤️🔥
Step into the raw world of #PEDDI#PEDDITrailer in 4 days 🔥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/HAV93MYYab
— Vriddhi Cinemas (@vriddhicinemas) May 14, 2026
