Petrol Price Hike | వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు

Petrol Price Hike | వాహనదారులకు షాకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు సగటున రూ.3 వరకు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.

petrol prices hike

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.97.77కు, డీజిల్ ధర రూ.9067కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.108.74, చెన్నైలో రూ.103.67కి పెరిగింది. గత ధరలతో పోలిస్తే కోల్‌కతాలో రూ.3.29, చెన్నైలో రూ.2.87 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరగ్గా, తెలంగాణలో రూ.3 చొప్పున పెరిగాయి.

ప్రైవేటు చమురు సంస్థలు ఇప్పటికే ధరలను పెంచాయి. నయారా ఎనర్జీ మార్చిలోనే పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు, నిత్యవసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read More:

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ కోర్టు షాక్

మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్‌ : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Latest News