Fuel Price Hike | యుద్దం ఎఫెక్ట్ …పెరిగిన పవర్ పెట్రోల్, ఇండస్ట్రీయల్ డీజిల్ ధరలు !

ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్దంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇంధన సరఫరాలో నెలకొన్న సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. శుక్రవారం నుంచి లీటర్ ప్రీమియం పవర్ పెట్రల్, ఇండస్ట్రీయల్ డీజిల్ ధరలు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 20, 2026, 6:13 pm IST
Read Time: 5 mins
Fuel Price Hike | యుద్దం ఎఫెక్ట్ …పెరిగిన పవర్ పెట్రోల్, ఇండస్ట్రీయల్ డీజిల్ ధరలు !

Fuel Price Hike | ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్దంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇంధన సరఫరాలో నెలకొన్న సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే భారత్ లో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడగా…ఇప్పుడు క్రమంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం నుంచి లీటర్ ప్రీమియం పవర్ పెట్రల్ పై రూ.2 నుంచి 2.35 పెరుగుదల అమల్లోకి వచ్చింది. దీంతో లీటరు పవర్ పెట్రోల్ ధర రూ.115కి చేరుకుంది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించింది.పెంచిన రేట్లు ప్రాంతాలను అనుసరించి కొంచెం అటు ఇటుగా ఉండనున్నాయి. అయితే సాధారణ ఇంధనం ధరలు మాత్రం యధాతథంగా కొనసాగనున్నాయి.

పెరిగిన ఇండస్ట్రియల్‌ డీజిల్‌ ధరలు

పవర్ పెట్రోల్ తో పాటు ఇండస్ట్రియల్‌ డీజిల్‌ ధరలు పెరిగాయి. దీని ధరను లీటర్‌కు రూ.22 పెంచారు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటన చేసింది. ప్రస్తుతం రూ.87.57గా ఉన్న ఇండస్ట్రీయల్ డిజీల్ ధర రూ109.50కి చేరునుంది. ఈ డీజిల్ ను పరిశ్రమలు, రవాణా, పవర్ జనరషనలో ఉపయోగిస్తారు. దీని ధర పెరగడంతో ప్రోడక్షన్ కాస్ట్, రవాణా చార్జీలు పెరుగి..అనేక వస్తువుల ధరల పెరుగనున్నాయి. సాధారణ డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి.

పశ్చిమాసియా యుద్ద సంక్షోభంతో పెట్రోల్, డీజిల్ దిగుమతులకు ఆటంకం నెలకొంది. దీంతో భారత్ లో పెట్రోల్, డిజీల్ సరఫరాకు కొరత ఏర్పడింది. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లోని అనేక బంక్ లలో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. యుద్ధం తర్వాత తొలిసారిగా పెట్రోల్ రేట్ల పెంపును చూస్తుంటే రానున్న కొద్ది రోజుల్లోని మిగిలిన సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఆటో ఎల్పీజీ, సీఎన్జీ ధరలు కూడా పెరగటం స్టార్ట్ అవుతాయని చమురు రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 108.26 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ (WTI) ధర 95.27 డాలర్లుగా ఉంది. చమురు ధరలు గనుక బ్యారెల్‌కు 110 డాలర్లు దాటితే.. అది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారనుంది. ఒకవేళ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లు దాటితే.. అప్పుడు సాధారణ పెట్రోల్ ధరలను పెంచడం తప్పనిసరి అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy| ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయి : సీఎం రేవంత్ రెడ్డి
india fuel price hike| యుద్దం ఎఫెక్ట్ …పెరిగిన పవర్ పెట్రోల్, ఇండస్ట్రీయల్ డీజిల్ ధరలు !