Revanth Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయి

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చట్ట ప్రకారమే దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.

Revanth Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయి

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయి అని, చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని, అరెస్టులు ఉంటాయని, ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు క్లీన్ చీట్ వచ్చిందని హరీష్ రావు ప్రచారం చేసుకుంటున్నాడని, పంజాగుట్టాలో నమోదైన చక్రధర్ కేసులో మాత్రమే ఆయనకు క్లీన్ చీట్ లభించింది అని తెలిపారు. బీఆర్ఎస్ హయంలో 6 వేల ఫోన్లు ట్యాప్ చేశారు అని, ఒక పద్దతి ప్రకారమే విచారణ జరుగుతోంది, విచారణ చేయకుండా అరెస్ట్‌ చేయలేం కదా? అన్నారు. ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందని.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్‍ను సస్పెండ్ చేశామన్నారు. హిల్ట్ పాలసీ సహా దేనిపైన అయినా 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం అని, కేటీఆర్, హరీశ్ రావులు కోరే విచారణను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

టెన్త్ పరీక్షలు ఇకపై ఉండవు, నర్సరీ నుంచి 12 వరకు ఒకే విద్యా విధానం

రాష్ట్రంలోని విద్యా విధానంలో కీలక మార్పులు చేస్తున్నాం అని, ఇకపై రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఉండబోవని రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేయనున్నామని వెల్లడించారు. దీనిపై కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. అయితే ఈ నివేదికే ఫైనల్‌ కాదని పేర్కొన్నారు. జాతీయ స్థాయి అధ్యయనం తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసమ్మతి ఎపిసోడ్ ను పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ చూసుకుంటారని తెలిపారు.

జిల్లాలు, మండలాల పునర్విభజనపై ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండబోవని, రిటైర్డ్ జడ్జీతో ఇప్పటికే కమిషన్ వేస్తామని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు ముగిసేవరకు వాటిలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయబోమన్నారు.

మూసీ ప్రక్షాళన అంశంలో ప్రతిపక్షాలకు కాకుండా ప్రజలకు జవాబుదారిగా ఉంటామన్నారు. ఢీల్లీ పర్యటనలు రాష్ట్ర అభివృద్దికి సంబంధించి కొనసాగుతాయని, అందుకోసమే కేంద్రం సీఎంకు ఢిల్లీలో బంగాళా కూడా ఏర్పాటు చేసిందని గుర్త చేశారు. మూసీ ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంశాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ డ్రగ్ కేసుపై బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. వాళ్ల ఇద్దరి బంధం ఏంటో ఇక్కడే అర్ధమవుతోంది అని, బీఆర్ఎస్ పార్టీని తొక్కుతా అంటే బీజేపీ వాళ్లు ఎందుకు బాధ పడుతున్నారు? అని అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy| ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయి : సీఎం రేవంత్ రెడ్డి
Salem Bus Accident : తమిళనాడులో అదుపు తప్పిన బస్సు..8మంది మృతి