Salem Bus Accident : తమిళనాడులో అదుపు తప్పిన బస్సు..8మంది మృతి

తమిళనాడులో సేలం సమీపంలో అదుపు తప్పిన ప్రభుత్వ బస్సు వాహనాలపైకి దూసుకెళ్లి 8మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 20, 2026, 4:45 pm IST
Read Time: 2 mins
Salem Bus Accident : తమిళనాడులో అదుపు తప్పిన బస్సు..8మంది మృతి

విధాత: తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అరియనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు వాహనాలపైకి దూసుకెళ్లిన ప్రమాదంలో స్పాట్ లోనే 8 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

తమిళనాడు స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TNSETC) బస్సు నియంత్రణ కోల్పోయి, డివైడర్‌ను దాటి..అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లి వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

మాది పీపుల్స్ సెంట్రిక్ బడ్జెట్ : భట్టి విక్రమార్క చిట్ చాట్
Hyderabad Metro Rail Issue | ఆగిన హైదరాబాద్ మెట్రో రైళ్లు