Hyderabad Metro Rail Issue | ఆగిన హైదరాబాద్ మెట్రో రైళ్లు

హైదరాబాద్ మెట్రో రైళ్ల నిర్వహణలో మరోసారి సాంకేతిక సమస్య ఎదురైంది. శుక్రవారం అమీర్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో నడుస్తున్న మెట్రో రైలులో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది

Reported by: Y.V. Narsimha Reddy | హైదరాబాద్​ | Mar 20, 2026, 1:06 pm IST
Read Time: 1 mins
Hyderabad Metro Rail Issue | ఆగిన హైదరాబాద్ మెట్రో రైళ్లు

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైళ్ల నిర్వహణలో మరోసారి సాంకేతిక సమస్య ఎదురైంది. శుక్రవారం అమీర్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో నడుస్తున్న మెట్రో రైలులో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రెండు వైపులా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.

మెట్రో రైళ్ల రాకపోకలలో నెలకొన్న అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్ల పునరుద్దరణకు సిబ్బంది రంగంలోకి దిగి మరమ్మతుల కోసం శ్రమిస్తున్నారు.