Harish Rao | భట్టి బడ్జెట్.. ఇదొక వట్టి బడ్జెట్ : హరీశ్ రావు ఫైర్

తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ బోగస్ బడ్జెట్, బడా జూటా బడ్జెట్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు విమర్శించారు. ఇది అభయ హస్తం కాదు.. రిక్త హస్తం అని అర్థమైందని ఎద్దేవా చేశారు.

Harish Rao | భట్టి బడ్జెట్.. ఇదొక వట్టి బడ్జెట్ : హరీశ్ రావు ఫైర్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ బోగస్ బడ్జెట్, బడా జూటా బడ్జెట్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు విమర్శించారు. ఇది అభయ హస్తం కాదు.. రిక్త హస్తం అని అర్థమైందని ఎద్దేవా చేశారు. తెలంగాణను, హైదరాబాద్ ను మూడు ముక్కలు చేయడం తప్ప విజన్ లేదు..విషయం లేదు అని, పింఛన్ల పెంపు లేదు.. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ఊసు లేదని విమర్శించారు. ఓట్లేసిన ప్రజలను వెన్నుపోటు పొడిచారు.. అన్ని వర్గాల ప్రజలకు మొండి చెయ్యి చూపించారు అని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి, సింగరేణి కార్మికులకు మొండి చేయి చూపారని, ముదిరాజులకు, గౌడన్నలకు, గొల్ల కుర్మలకు ఇలా అన్ని బీసీ వర్గాలకు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు, మహిళలకు, ఆశా, అంగన్ వాడీలకు మొండి చేయ చూపారన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్, దగాకోరు బడ్జెట్, పేదలను వంచించిన బడ్జెట్, ఆరు గ్యారంటీలను పాతరేసిన బడ్జెట్ అని విమర్శంచారు.

ఈ బడ్జెట్‌లో సకల జనులకు దక్కింది గుండుసున్నా

ఈ బడ్జెట్‌లోసకల జనులకు దక్కింది గుండు సున్నా అని, అంకెల గారడీ.. మాటల గారడీ.. తప్ప పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని హరీశ్ రావు విమర్శించారు. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన సీఎం రేవంత్
ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. సకల జనులను సంపూర్ణంగా ముంచిన బడ్జెట్ ఇది అని, ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు పోయిన బడ్జెట్ కంటే కేటాయింపుల్లో కోత పెట్టారని, తెలంగాణ ప్రజలను పూర్తిగా దగా చేశారు అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కండ్లు తెరిస్తే తప్ప మన హక్కులను సాధించుకోలేం అని హెచ్చరించారు.

అభివృద్ది రేటుపై  దంద్వ మాటలు

కేసీఆర్ పాలనలో తెలంగాణ GSDP 12.5% పెరిగితే..రేవంత్ పాలనలో ఆ సంఖ్య 10.7 శాతానికి తగ్గింది అని పేర్కొన్నారని, అంటే రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని స్పష్టం అవుతుంది అన్నారు. అంతేకాదు తెలంగాణ జీఎస్పీడీపీ రేటు దేశ సగటు కంటే అధికంగా ఉందన్ని ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బయట రాష్ట్రం దివాళా తీసిందంటున్నారని ఎవరి మాట నమ్మాలని ప్రశ్నించారు. దేశ సగటు కంటే తెలంగాణ అభివృద్ది రేటు ఎక్కువగా ఉంటే ఆరు గ్యారంటీల అమలులో కోతలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చేసిన బ్రేక్‌ఫాస్ట్ పథకం ఆపేసి, ఇప్పుడు మళ్లీ ఏదో కొత్తగా వాళ్లే తెచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు అని ఆరోపించారు. టిమ్స్ సనత్‌నగర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఐదు తేదీలు మార్చారు అన్నారు

ఇవి కూడా చదవండి :

Harish Rao| భట్టి బడ్జెట్.. ఇదొక వట్టి బడ్జెట్ : హరీశ్ రావు ఫైర్
గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు