గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
భద్రాచలం సమీపంలోని గోదావరిలో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతయ్యారు. ఇప్పటికే పలువురి మృతదేహాలు లభించగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.
విధాత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద కొల్లుగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు యువకులు నదిలో స్నానానికి దిగారు. వారిలో ఐదుగురు నదిలో గల్లంతయ్యారు. లోతు తెలియక వారు గల్లంతైనట్లుగా తెలుస్తుంది. గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో గల్లంతైన వారి కోసం బోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు అంతా కూడా ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో గల SRM యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏడుగురు విద్యార్థుల బృందం సెలవుల నేపథ్యంలో భద్రాచలం పర్యటనకు వచ్చారు.
భద్రాచలానికి చెందిన శ్రీకర్, అభిరామ్ లతో పాటు ఉయ్యూరుకు చెందిన నవదీప్, మదనపల్లికి చెందిన సతీష్ మృతదేహాలను వెలికితీశారు. తేజజ్ఞ( ఉయ్యూరు) మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి :
Salem Bus Accident : తమిళనాడులో అదుపు తప్పిన బస్సు..8మంది మృతి
Telangana Budget 2026-27 | మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా బడ్జెట్ : భట్టి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram