భద్రాచలంలో విషాదం.. నాలాలో పడి మహిళా కానిస్టేబుల్ మృతి

  • By: Somu    latest    Sep 30, 2023 12:41 PM IST
భద్రాచలంలో విషాదం.. నాలాలో పడి మహిళా కానిస్టేబుల్ మృతి

విధాత: విధి నిర్వాహణకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. కొత్తగూడెంలో విధులు నిర్వర్తించే మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి డ్యూటీలో భాగంగా భద్రాచలం వచ్చారు.


విధి నిర్వాహణ పిదప భద్రాద్రి రామయ్యను దర్శించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెలుతున్న క్రమంలో ఆమె తన స్కూటీతో పాటు సత్రం ఎదురుగా ఉన్న నాలాలో పడిపోయారు.


శనివారం భద్రాచలంలో భారీ వర్షం పడటంతో నాలాలో వరద నీరు ఉదృతి పెరిగింది. శ్రీదేవి నాలాలో పడిపోయిన సమాచారం అందుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టి స్లూయిజ్ గేట్ల వద్ధ చిక్కుకున్న ఆమె మృతదేహాన్ని వెలికితీశారు.